యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ మహానగరంలోని గాజువాకపై పూర్తిస్థాయి దృష్టిసారించాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. గాజువాక నియోజకవర్గం నుంచి స్వయంగా పోటీ పడుతుండడంతో నియోజకవర్గం వ్యవహారాలతోపాటు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అద్దె ఇంటిని తీసుకున్నారు. ‘ఓ ఇల్లు లేదు...కార్యాలయం లేదు’ అంటూ విపక్ష టీడీపీ, వైసీపీ విమర్శలదాడి చేస్తుండడంతో గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై ఇక్కడే నివాసం ఉంటారని, ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే చక్కబెడతారని పార్టీ వర్గాల సమాచారం.