బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడడం లేదని, ప్రతీ విషయానికి గొడవ పడుతున్నారని ఆ కథనంలో పేర్కొంది. తొందరపడి ఒక్కటైన వీరిద్దరూ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారంటూ రాసిన కథనం బాలీవుడ్‌లో చర్చకు కారణమైంది. పెళ్లి తర్వాత ప్రియాంక స్వభావం మారుతుందని, సహజ ధోరణికి వస్తుందని నిక్ భావించాడని, కానీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో నిక్ ఆవేదన చెందుతున్నాడని పేర్కొంది.
వీరిద్దరూ గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జోధ్‌పూర్‌లో వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.