యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
కైలాసనాధుడైన పరమేశ్వరుడు వివిధ కాలాలలో చేసిన నృత్యాలను తాండవాలని అని అంటారు. శాంతరూపుడై ఆనంద సమయాలలో చేసిన నృత్యాన్ని ఆనందతాండవమని , క్రోధావేశంలో చేసిన నృత్యాన్ని రుద్రతాండవమని , యుగాంతంలో చేసిన నృత్యం ప్రళయతాండవమని నాట్యశాస్త్రంలో వివరించబడింది. ఆయన వివిధ గతులలో పట్టిన నృత్యభంగిమలను , ముద్రలను కరణములని పేరు. ఇవి 108 గా భరతశాస్త్రంలో సవివరంగా తెలియజేయబడ్డాయి.
మన దేశంలోని శైవక్షేత్రాలలో ముఖ్యంగా దక్షిణాది శివాలయాలలో పరమశివుడు నటరాజుగా కొనియాడబడుతున్నాడు. నటరాజస్వామి చేసిన వివిధ నృత్యహేల అద్భుత శిల్పాలద్వారా మనకు అపరిమితానందం కలుగజేస్తుంది. ఆయా దేవాలయాలలో శిల్పాలను ఆధారంగా చేసుకొని నృత్య కళాకారులు తమ లోని కళాకౌశలాన్ని అభివృధ్ధిపర్చుకుంటారు.
మహాలక్ష్మి చేసిన తపస్సుకి మెచ్చి, పరమశివుడు చేసిన
తాండవమే లక్ష్మీ తాండవం.
ఈ దేవతామూర్తిని
తిరుపత్తూరు జిల్లా
తిరుత్తళిలో దర్శించగలము.
అగస్త్య మహర్షి కోసం
పది హస్తాలతో ఎడమకాలు క్రింద
ఆన్చుకొని, కుడికాలు
పైకెత్తి చేసిన తాండవం
ఆనంద తాండవం.
తిరువారూరు లో విష్ణు
భగవానుని గుండెల్లో నుండి వచ్చే ఊపిరి కి
తగినట్లు చేసిన తాండవం
అజబాతాండవం అంటారు.
పళనికి సమీపమున
'కొళుమమ్' ఆలయంలో, 'నిత్య తాండవ మూర్తి'
అని పిలువబడే యీయన అగ్నిదేవునికి నటరాజ మూర్తి గా దర్శన మిచ్చాడు.
తిరువారూరు కి దగ్గరలోవున్న తిరుక్కారై అనే వూళ్ళో
నటరాజస్వామి అంశయైన 'ఆది విడంగర్'
'కుక్కుట' తాండవం చేసేడు. ఆ తాండవ భంగిమలు యుద్ధానికి వెళ్ళే పందెపు
కోడి వలె అటూ ఇటూ,
గమనిస్తూ,కుడి ప్రక్కకు,
ఎడం ప్రక్కకు, వంగుతూ
ముందుకుసాగి ,
నిదానంగా చుట్టూ తిరగుతూ వుండేలా గోచరిస్తాయి.
తిరునల్లారు ఆలయంలో
'నాగవిడంగర్' చేసే తాండవం 'ఉన్మత్త' తాండవం.
నాగై జిల్లా వేదారణ్యంలో
'భువని విడంగర్' స్వామి చేసిన
తాండవం, హంసపాద
తాండవం. ఇది హంసనడకలా వయ్యారంగా
సాగుతుంది .
ఈశ్వరుడు కాలుని సంహరించి న తరువాత
చేసిన తాండవం 'కాల సంహార' తాండవం. ఈ
మూర్తి ని మైలాడుదురై పట్టణానికి దగ్గరగానున్న తిరుక్కడైయూరులో
దర్శిస్తాము.
కాళికాదేవి గర్వం అణచడానికి ఈశ్వరుడు
చేసిన తాండవం
'ఊర్ధ్వ తాండవం'
యీ మూర్తి ని చెన్నై
తిరువళ్ళూరు సమీపాన,
వున్న 'తిరు వేలంగాడు'
అనే ఊరిలో దర్శిస్తాము.
చిదంబరం లో పంచ సభలలో నటరాజస్వామి తాండవ
మూర్తుల శిల్ప , చిత్ర భంగిమలు కన్నులపండువ చేస్తాయి.
ఈశ్వరుడు పార్వతీ దేవికి చూపించి న గౌరీ తాండవ
మూర్తిని మనం , మైలాడుతురై
మయూరనాధుని, ఆలయంలో దర్శించగలము.
చిదంబరం సమీపాన గల
'కూడలైఆట్రూరు' లో
ఈశ్వరుడు , బ్రహ్మదేవునికి , తాండవ
మూర్తి గా , దర్శనము
అనుగ్రహించి,
'నర్తన వల్లభేశ్వరుని' గా
పిలువ బడుతున్నాడు.
లయకారుడైన మహేశ్వరుని ఆధ్యాత్మిక లీలా విశేషాలెన్నో మన ప్రాచీన దేవాలయాలు కళ్ళకుకట్టేలా చూపుతున్నాయి.
ఆ అధ్భుత దృశ్యాలను వీక్షించగలిగినవారి భాగ్యమే భాగ్యం.