YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాలో చేరిన జీవిత, రాజశేఖర్ లు

 వైకాపాలో చేరిన జీవిత, రాజశేఖర్ లు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సినీనటులు రాజశేఖర్, జీవితలు వైసీపీలో చేరారు. సోమవారం  వైకాపా  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు.  పార్టీ కండువా కప్పి జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. గతంలో జీవిత, రాజశేఖర్లు టీడీపీ సానుభూతిపరులుగానే వుండేవారు. 2009లో కాంగ్రెస్లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. తరువాత వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవి విషయంలో వచ్చిన విభేధాలను క్లియర్ చేసుకున్నాం.  ఇప్పుడు జగన్ తో వచ్చిన విబేధాలను తొలగించుకున్నాం. చంద్రబాబు తరవాత వైఎస్ వచ్చారు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు.  వైఎస్ వంటి నాయకులు ఇంకా రారు అనేలా ఆయన పాలన సాగిందని అన్నారు. వైఎస్ పుత్రుడుగా జగన్ వచ్చారు. పది ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ ఎంతో మారిపోయారని, ఒకప్పుడు తాను చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూసిన జగన్ వేరని అన్నారు. ఇన్ని రోజులు జగన్ వెంట నడవనందుకు చాలా బాధ పడ్డానని అన్నారు. అందుకే ఎన్నికల ముందే ఆయనతో ఉన్న విబేధాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. జగన్ వెంట నడవడానికి సిద్ధం అయ్యి  వైసిపి లో జాయిన్ అయ్యామని అన్నారు. చంద్రబాబు కి మూడు సార్లు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు జగన్ కి అవకాశం ప్రజలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు , జగన్ ఎవరు సీఎం అంటే జగనే అనే ఆలోచన మనమందరం చెయ్యాలని అన్నారు.  జీవిత మాట్లాడుతూ మహిళలు పసుపు కుంకుమలని నమ్మదు. ప్రజల కోసం పది  సంవత్సరలుగా పోరాటం చేస్తున్న జగన్ ని గెలిపించాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీ లు దొంగలా కలిసి పనిచేస్తున్నాయి. వాటిని నమ్మవాల్సిన అవసరం లేదని అన్నారు. 

Related Posts