Highlights
- హృద్రోగంతో పెరుగుతున్న హఠాన్మరణాలు
- మహిళల్లోనూ ఎక్కువ...
- శ్రీదేవి ఉదంతంతో ఉలికిపాటు
- అధిక రక్తపోటు కారణం
అతిలోక సుందరి శ్రీదేవి తీవ్ర హృద్రోగానికి లోనై లోకం విడిచి పెళ్లిపోవడం ఆమె అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఒక్క శ్రీదేవి ఉదంతమే కాదు...ఇటీవల గుండె జబ్బుతో ఆకస్మికంగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కూడా హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజల్లో ఎంత ఆరోగ్య స్పృహ పెరుగుతున్నా సరే...గుండె ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఆకస్మిక మరణాలు ఇలా..
అప్పటికే గుండె సమస్యలు ఉన్నవారిలో 30 శాతం మంది హఠాన్మరణానికి గురవుతారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బరువు తగ్గడానికి, అందంగా కన్పించడానికి చాలామంది ఆహారాన్ని పూర్తిగా తినడం మానేస్తుంటారు. ఇది ప్రమాదం. నిపుణులు సూచనలు పాటిస్తే మేలు.
ఆహారపు అలవాట్లలో తేడాలు కారణంగా ఒక్కోసారి పోటాషియం తగ్గుతుంది. ఇది రక్తపోటుపై ప్రభావం పడి గుండె వైఫల్యానికి దారి తీయవచ్చు.
బరువు తగ్గించుకోవడానికి అదేపనిగా వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో మినరల్స్ బయటకు పోతాయి. ఎప్పటికప్పుడు తిరిగి శరీరానికి అందిస్తుండాలి. అలా కాని పక్షంలో నిర్జలీకరణం(డీహైడ్రేషన్) అయి గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.
విపరీతమైన ఒత్తిడి, అలసట ఇతర కారణాలతో గుండెలో కీలకమైన దమనులు ఒక్కసారిగా కుంచించుకు పోయి హఠాన్మరణం సంభవించవచ్చు.
మధుమేహం, అధికరక్తపోటు, కుటుంబ చరిత్ర ఉన్న వారిలో కూడా ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.
కొందరు సెలబ్రిటీలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపుతుంటారు. బరువు పెరిగి చివరికి హృద్రోగ సమస్యలకు దారి తీస్తుంది.
ఆ రెండు గంటలు కీలకం...
గుండె నొప్పి వచ్చిన తర్వాత 2 గంటలు చాలా కీలకమైనవి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫోన్ చేసిన వెంటనే అంబులెన్సును వస్తుంది. లక్షణాలను బట్టి నేరుగా బాధితులను క్యాథ్‌ల్యాబ్‌కే తరలించి చికిత్స అందిస్తారు. మన వద్ద అత్యవసర విభాగం నుంచి మెడిసిన్ అక్కడ నుంచి కార్డియాలజీలో వైద్యులు చూసిన తర్వాత క్యాథ్‌ల్యాబ్‌కు తరలించడం వల్ల సమయం వృథా అవుతోందని నిపుణులు చెబున్నారు.
మహిళల్లోనూ ఎక్కువ...
గుండె సమస్యలతో వస్తున్న వారిలో మహిళలు అధిక శాతం మంది ఉంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. స్త్రీలు ఎక్కువ మంది మృత్యువు పాలవుతుండటానికి ముఖ్య కారణం గుండె జబ్బులే. నగరంలో మహిళల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో పురుషులు, మహిళలు దాదాపు సరిసమానంగా ఉంటున్నారు. నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ.
అధిక రక్తపోటు అతి పెద్ద కారణం
గుండె జబ్బు, పక్షవాతాలకు అధిక రక్తపోటు అతి పెద్ద కారణం. స్త్రీలు తరచూ బీపీ చూపించుకోవడం చాలా ముఖ్యం. అంతేకాక పబ్ కల్చర్ నగరంలో పెరిగిన తర్వాత...యుక్త వయసులోని స్త్రీలు సైతం ధూమపానానికి అలవాటు పడుతున్నారు. కొన్నిసార్లు తాము పొగతాగకున్నా...ఇంట్లో భర్త లేదా ఇతరులు సిగరెట్లు తాగి వదిలే పొగను పీల్చడం ద్వారా కూడా మహిళల్లో ఈ హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి. స్త్రీలు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన అలవాట్లు సదా ఆరోగ్యవంతులుగా ఉంచుతాయని గుర్తించాలి.
ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..
1 . అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లను కొందాం(కాకపోతే ఒంటరిగా).
2మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3 ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5 మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6 మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
9 . బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.