YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నామినేషన్ వేసిన ములాయాం

నామినేషన్ వేసిన ములాయాం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తాను ప్రధానమంత్రి రేసులో లేనని అన్నారు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్. తన తనయుడు అఖిలేష్‌తో కలిసి సోమవారం మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి నామినేష‌న్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి తరఫున ఎవరు ప్రధాని అభ్యర్థి అని ప్రశ్నించగా.. అది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఈ ఎన్నికల్లో ములాయం గెలుస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ స్పష్టం చేశారు. మెయిన్‌పురిలో కాంగ్రెస్‌తోపాటు ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిషీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా కూడా తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు. బీఎస్పీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. ఆ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ మెయిన్‌పురి స్థానం నుంచే ములాయం 1996, 2004, 2009, 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. 1996 నుంచి ఉప ఎన్నికలతో సహా ఎస్పీ ఈ స్థానం నుంచి వరుసగా 8 సార్లు విజయం సాధించడం విశేషం. బీజేపీ ఎప్పుడూ ఇక్కడ గెలవలేదు. మెయిన్‌పురిలో ఇప్పటికీ చాలా మంది ములాయంను ముఖ్యమంత్రి అనే పిలుస్తుండటం విశేషం. ములాయం పూర్వీకుల గ్రామం ఇదే నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇప్పుడా గ్రామంలో ఓ మెడికల్ కాలేజ్, మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, రెండు ఇతర స్టేడియాలు, ఎయిర్‌స్ట్రిప్ ఉండటం విశేషం

Related Posts