యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారని ఆయన మాటలు నమ్మి మరోసారి అధికారం ఇస్తే... ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలను పాతాళంలోకి నెట్టేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. 2014ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశపడి మోస పోవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్.కోట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారంవిజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారన్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్.కోట నియోజకవర్గం గుండా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి చెబుతున్నా నేనున్నాను. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఇదే నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ పుట్టిన తర్వాత ఒక్క 2004 తప్ప, మిగతా 30 ఏళ్ల పాటు తెలుగు దేశం పార్టీని ఇక్కడ గెలిపించారు. ఇంతగా టీడీపీని ఆశ్వీరదించిన ఈ నియోజకవర్గంలో ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తించుకునే మూడు పనులు అయినా జరిగాయా? ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు.