YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ పై తుషార్ వెల్ల‌ప‌ల్లి పోటీ

 రాహుల్ పై తుషార్ వెల్ల‌ప‌ల్లి పోటీ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎన్డీఏ అభ్య‌ర్థిగా తుషార్ వెల్ల‌ప‌ల్లి పోటీ చేయ‌నున్నారు. భార‌త ధ‌ర్మ జ‌న సేన నేత తుషార్ వెల్ల‌ప‌ల్లే తొలుత త్రిసూర్ నుంచి పోటీ చేస్తార‌ని భావించారు. వాస్త‌వానికి ఆయ‌న అక్క‌డ ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టారు. కానీ వ‌య‌నాడ్ నుంచి తుషార్ పోటీ చేయ‌నున్న‌ట్లు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా వెల్ల‌డించారు. ఇక త్రిసూర్ స్థానం నుంచి మాత్రం బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేయ‌నున్నారు. రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు

Related Posts