యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రౌడీలను తలపిస్తూ టిడిపి ఎంఎల్ ఏలు ఐదేళ్లు పరిపాలించారు. మళ్లీ టిడిపికి ఓటేస్తే విజయవాడలో గూండాగిరి పెరుగుతుంది. టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తే సామాన్యులు బతికేపరిస్దితి లేదని వైకాపా విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. దౌర్జన్యాలు, బెదిరింపులకు విజయవాడను కేంద్రంగా మార్చారు. రవాణా కమీషనర్ పై టిడిపి గూండాలు దాడిచేశారు. బొండాఉమా లాంటి వాళ్లు ఎంఎల్ ఏలయ్యాక రౌడీయిజం పెరిగింది. కల్తీమద్యం కేసులో తొలి ఎఫ్ ఐ ఆర్ లో నాపేరు లేదు. తెలుగుదేశం నేతలు భవిష్యత్తులో అడ్డంకి అవుతానని రెండో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించి అందులో నా పేరు చేర్చారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అయన అన్నారు. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నివేదికలో నా పేరు లేదు. ఎప్ ఎస్ ఎల్ నివేదికలలో సైతం ఎవరో కావాలనే వాటర్ లో సైనేడ్ కలిపారనే వచ్చింది. నీ ప్రభుత్వం అధికారంలో ఉంది.దర్యాప్తు చేయించుకోవచ్చు. నీ కబ్జాలపై మీ ప్రభుత్వంలోనే సిబిసిఐడినే మీకుటుంబం పాత్రపై నివేదిక ఇచ్చిందని విమర్శించారు. కల్తీ మద్యం అంశంలో తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం. కావాలంటే బహిరంగ చర్చకు రా?నిరూపించు.ఎప్ ఎస్ ఎల్ నివేదికలు ప్రజలముందుంచితే వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రజలు కూడా టిడిపికి ఓటేసే విషయం ఆలోచించుకోండి. టిడిపి గూండాల ఆగడాలను అరికట్టాలంటే వైయస్సార్ కాంగ్రెస్ కు మద్దతు పలకాలి. మార్నింగ్ వాక్ కు వెళ్లిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడ్ని బొండా ఉమ అకారణంగా దుర్భాషలాడిన విషయం రాష్ర్టంలోని ప్రజలందరూ గమనించారని అయన గుర్తు చేసారు.