YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాయనాడ్ లో పోటీతో కాంగ్రెస్ కు కలిసొస్తుందా

వాయనాడ్ లో పోటీతో కాంగ్రెస్ కు కలిసొస్తుందా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మనం అందరం ఊహించుకుంటున్నదీ, చర్చించుకుంటున్నదీ నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. యూపీలోని అమేథీతోపాటూ... కేరళ లోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ ఈసారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. అసలు రాహుల్ రెండుచోట్ల పోటీ చెయ్యాల్సిన అవసరం ఏముందన్నది మొదటి ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఆ అవకాశం ఉన్నా... రాహుల్ బదులు... రెండో స్థానంలో మరో అభ్యర్థిని నిలబెడితే... ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లవుతుందన్నది విశ్లేషకుల మాట. ప్రధాని నరేంద్ర మోదీ లాగే... రాహుల్ కూడా రెండు చోట్ల పోటీ చెయ్యాలనుకోవడం ఎంతవరకూ సమంజసమన్న వాదనపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
రాహుల్ అమేథీలో ఈసారి ఓడిపోతారనీ, అక్కడ రెండోసారి బరిలో దిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈసారి కచ్చితంగా గెలుస్తారనీ, అందుకే రాహుల్ ఆల్టర్నేట్‌గా వాయనాడ్‌ను ఎంచుకున్నారని ప్రత్యర్థి పార్టీలు ఉతికారేస్తున్నాయి. అఫ్‌కోర్స్ కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలు అంతే ఫోర్స్‌తో తిప్పికొడుతున్నారు కూడా. మోదీ... గుజరాత్‌ వదిలి వారణాసిలో కూడా ఎందుకు పోటీ చేశారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
వాయనాడ్ ప్రత్యేకతలు ఇవీ :
* 2008లో నియోజక వర్గాల పునర్విభజనలో ఏర్పడింది.
* 30 శాతం అడవే. జనాభా తక్కువే* హిందువుల మొత్తం జనాభా 49.7 శాతం. ఎస్సీలు 35.4 శాతం, ఎస్టీలు 7.6 శాతం.
* క్రిస్టియన్లు 21.5 శాతం, ముస్లిం మైనార్టీలు 28.8 శాతం.
* 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 3 జిల్లాల్లో - వాయనాడ్, కోజికోడ్, మళప్పురంలో ఉన్నాయి.
* 2009, 2014లో కాంగ్రెస్ నుంచీ ఎంఐ షానవాజ్ గెలిచారు. 2009లో 1.53 లక్షల ఓట్ల తేడాతో.... 2014లో 20,000 మెజార్టీతో గెలుపొందారు.
* మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. గిరిజన గ్రామాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది.
* రాజకీయంగా ప్రస్తుతం వాయనాడ్ కాంగ్రెస్‌కి కంచుకోట అనుకోవచ్చు. ప్రస్తుత కేరళ ప్రభుత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో కాంగ్రెస్‌తోపాటూ, ముస్లింలీగ్ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది.
* వాయనాడ్‌లోని ఏడు లోక్ సభ నియోజక వర్గాల్లో... 4 చోట్ల ముస్లింల ఆధిపత్యం ఉంది. వాళ్లు కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నారు.
* ఇక్కడి ఓటర్లలో ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ప్లాంటేషన్ శ్రామికులే. కాంగ్రెస్ పథకాలపై వాళ్లు పాజిటివ్‌గా ఉన్నారు.
* మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో రాహుల్ ఈజీగా గెలిచేస్తారన్నది కాంగ్రెస్ విశ్లేషణ.
రాహుల్ ప్రకటనపై మనందరికంటే ఎక్కువగా రియాక్టైనది ఎవరో కాదు కేరళలోని వామపక్షాలు. రాహుల్‌ని కచ్చితంగా ఓడిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ ప్రకాష్ కారత్ ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలను దెబ్బ తీసేందుకే రాహుల్‌ను బరిలో దింపారని ఆయన ఫైర్ అయ్యారు. ఆ మాత్రం కోపం ఉండటం సమంజసమే.రాహుల్ నిర్ణయంపై వాయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే... అమేథీలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ తమకు దూరమైపోయినట్లు ఫీలవుతున్నారు. ఆయన్ని కాపాడుకుంటామని సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నారు. ఒకవేళ... రాహుల్ రెండు స్థానాల్లోనూ గెలిస్తే... కచ్చితంగా వాయనాడ్‌ను వదిలేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే... ఆ స్థానంలో మరో కాంగ్రెస్ నేతను నిలబెట్టి... తిరిగి గెలిపించుకునే ఛాన్స్ ఉంటుంది.

Related Posts