YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ ఐదింటిపై కాంగ్రెస్ గురి

ఆ ఐదింటిపై కాంగ్రెస్ గురి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదేలై పోయింది. కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచినా అధికారంలోకి రాకపోవడంతో హస్తం పార్టీకి దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేసి కారెక్కేశారు. అసలేఅధికారంలోకి రాలేకపోవడం, ఉన్న ఎమ్మెల్యే చేజారి పోవడంతో హస్తం పార్టీ బేజారవుతోంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపొందడం టానిక్ లా కాంగ్రెస్ కు పనిచేస్తోందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గెలుపుతో లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న ధీమా కన్పిస్తోంది.లోక్ సభ నియోజకవర్గాల్లో 17 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఐదింటిలో మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని హస్తం పార్టీ గట్టిగా చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా మహాకూటమిలా వెళ్లడం లేదు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. తెలుగుదేశంపార్టీ బరి నుంచి తప్పుకుంది. నేరుగా కాంగ్రెస్ టీడీపీకి మద్దతిస్తోంది. తెలంగాణ జనసమితిది కూడా అదే తీరు. కోదండరామ్ సహకారాన్ని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కోరుతున్నారు. కనీసం ఐదు స్థానాల్లో గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న ఐదు పార్లమెంటు స్థానాల్లో మల్కాజ్ గిరి, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకీయ సమీకరణలు తమకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నాయి. నల్లగొండ పార్లమెంటు నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి నరసింహారెడ్డిని టీఆర్ఎస్ పోటీకి దింపింది. అయితే ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డిలు ఉత్తమ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే ఉత్తమ్ ఢిల్లీకి పరిమితమవుతారన్న భావన కావచ్చు కాని నల్లగొండ పరిధిలో కాంగ్రెస్ నేతలు ఐక్యతతో ముందుకు వెళుతున్నారు. ఇది కలసి వచ్చే అంశమే. టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అయినా పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ శాసనసభ్యులు ఉండటంతో ఆయనకు కొండంత ధైర్యంగా ఉంది.ఇక భువనగిరి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం కోమటిరెడ్డి కుటుంబానికి పట్టుండటంతో దానిని ఎంచుకున్నారు. ఇక్కడ బలంగా బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. అయినా ఆయనపై ఉన్న వ్యతిరేకతతో కోమటిరెడ్డి గట్టెక్కుతారంటున్నారు. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో దానిపై కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అక్కడ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ ప్రజలకు తెలియకపోవడం తమకు ప్లస్ అంటున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ తమకు కలసివస్తుందంటున్నారు. చేవెళ్ల స్థానం కూడా తమదేనని హస్తం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కొండావిశ్వేశ్వరరెడ్డి కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ తమకు శ్రీరామరక్ష అంటున్నారు. ఇక ఖమ్మం పార్లమెంటు నుంచి నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ బరిలోకి దింపినప్పుడే తమ విజయం ఖాయమయిందంటున్నారు. నామా పట్ల ఉన్న వ్యతిరేకతతో పాటు టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి ఖమ్మంలో రేణుక చౌదరి గెలుపునకు కృషి చేస్తాయని చెబుతున్నారు. మొత్తం మీద ఐదు స్థానాలు మాత్రం గట్టిగా వస్తాయని కాంగ్రెస్ నమ్మకంగా చెబుతోంది.

Related Posts