
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా చతికిలపడింది. అటు చేజారుతున్న మ్యాచ్‌ను పంజాబ్ పేసర్లు సామ్ కర్రాన్ (4/11), షమి (2/27) అద్భుత బంతులతో విరుచుకుపడి కాపాడారు. దీంతో 14 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు గెలిచింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 166 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), సర్ఫరాజ్ (29 బంతుల్లో 6 ఫోర్లతో 39) రాణించారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (39), ఇన్‌గ్రామ్ (38), ధవన్ (30) రాణించారు. అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కర్రాన్ నిలిచాడు.