YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పన్ను వసూళ్లలో నంద్యాల టాప్ ఎమ్మగనూర్ లాస్ట్

 పన్ను వసూళ్లలో నంద్యాల టాప్ ఎమ్మగనూర్ లాస్ట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కర్నూలు జిల్లాలోని 9 పురపాలిక సంఘాల్లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లు భారీగా పడిపోయాయి. గత రెండు నెలల నుంచి పురపాలక అధికారులు ఆస్తి పన్ను వసూళ్లలో ఎంతకష్టపడ్డా 74శాతానికి మించలేదు. జిల్లాలోని 9 పురపాలికల్లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నంద్యాల పురపాలక సంఘం అత్యధికంగా 74శాతం ఆస్తిపన్ను 2017, మార్చి 31 నాటికి వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. 9పురపాలిక సంఘాల్లో ఆస్తి పన్ను వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని పురపాలక సంఘంలో రూ. 10.24కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ. 6.01కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో ఆదోనిలో 58.70శాతం మాత్రమే ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి వసూలైంది. ఆళ్ళగడ్డ పురపాలక సంఘంలో రూ. 2.13 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 1.07 కోట్లు వసూలు చేసి 50.03 శాతం నమోదైంది. ఆత్మకూరు పురపాలక సంఘంలో రూ. 1.95కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 1.19కోట్లు వసూలు చేసి 60.70 శాతం నమోదైంది. డోన్ పురపాలక సంఘంలో రూ. 2.20కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 1.24కోట్లు వసూలు చేసి 56.30 శాతం నమోదైంది. గూడూరు పురపాలక సంఘంలో రూ. 0.57కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 0.46కోట్లు వసూలైంది. కర్నూలు కార్పొరేషన్‌లో రూ. 46.62కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 29.96కోట్లు వసూలు చేసి 64.30శాతం నమోదైంది. నందికొట్కూరు పురపాలక సంఘంలో రూ. 3.65కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 2.33కోట్లు వసూలు చేసి 63.90శాతం నమోదైంది. నంద్యాల పురపాలక సంఘంలో రూ. 12.13కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 9.08కోట్లు వసూలు చేసి జిల్లాలోనే అత్యధికంగా 74.80శాతం నమోదైంది. ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో రూ. 2.28కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 1.98కోట్లు వసూలు చేసి 70.10 శాతం నమోదైంది. 9పురపాలక సంఘాలలో 2016-17 సంవత్సరంలో రూ. 82.32కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ. 53.31కోట్లు వసూలు చేసి 64.76శాతం నమోదైంది. దీంతో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆస్తి పన్ను వసూళ్ళల్లో కర్నూలు జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నంద్యాల పురపాలక సంఘంలోనే ఆస్తి పన్ను వసూలు ఎక్కువ శాతం నమోదైంది. గత రెండు రోజుల నుంచి అన్ని పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను వసూళ్లు ముమ్మరం కావడంతో సెంట్రల్ సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో పన్ను వసూళ్లు కొంతమేర వేగం పుంజుకోలేదు. సర్వర్ పనిచేసి ఉంటే 80శాతం మేర నంద్యాల మున్సిపాలిటీ ముందంజలో ఉండేది. మార్చి 31వ తేదీ నాటికి ఆస్తి పన్ను అనుకున్న మేర వసూలు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుపై గడువు పెంచడమా లేక వడ్డీ మాఫీ చేస్తుందా అని వినియోగదారులు ఆశిస్తున్నారు.

Related Posts