YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. వైఎస్సార్ అభిమానులు ఇంటింటి ప్రచారం

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.             వైఎస్సార్ అభిమానులు ఇంటింటి ప్రచారం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 మంత్రాలయం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి  కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఎస్ సంజీవ్ కుమార్  ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రాలయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల పరిధిలోని సూగూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రాలయంకు చెందిన దాదాపు 45 మంది యువకులు రాఘవేంద్ర పురానికి చెందిన కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డితోనే సుస్థిర పాలన సాధ్యమని జగన్ డ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తారని అన్నారు. అందులో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 12,500 రూపాయలు,ఉచితంగా బోర్లు వేయిస్తారని, సున్నా వడ్డీ రుణాలు ఇస్తారని పొదుపు సంఘాలకు రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికి అందిస్తారని అన్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే పది లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు అని ప్రతి పేదవాడికి చదువు అయ్యే ఖర్చును పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.  వసతి భోజనం కొరకు అదనంగా ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు అందిస్తుందని పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి 2 లక్షల 50 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మూడు వేల రూపాయల ఫింఛను ప్రతి ఇంటి నుండి ఇద్దరు పిల్లలను బడికి పంపితే సంవత్సరానికి 15,000 రూపాయల తల్లిదండ్రులకు అందిస్తారని అన్నారు.  ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేసి గ్రామంలోని పది మంది చదువుకున్న యువతకు ఉద్యోగం కల్పిస్తామని 50 కుటుంబాలకు ఒక వాలెంటరీని నియమించి వారికి ఉపాధి అవకాశం కల్పిస్తుందని ఇంకా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు జరగాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీనివాసులు గబ్బూరు  నరసింహులు వడ్డే ఉరుకుందు తాటికొండ రవి గోవిందు బసవరాజు కాల్వ రాజు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts