YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నరేంద్రమోది, జగన్ లపై మండిపడ్డ మంత్రి యనమల

నరేంద్రమోది, జగన్ లపై మండిపడ్డ మంత్రి యనమల
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏటిఎంలలో డబ్బులు లేకుండా చేసింది ప్రధాని నరేంద్ర మోది నేనని   ఆర్ధిక మంత్రి యనమల ధ్వజం ఎత్తారు.  పోలవరాన్ని కూడా ఎంప్టీ ఏటిఎంగా చేశారు. మోదికి రాఫెల్ ఒక ఏటిఎం, రిలయన్స్ ఇంకో  ఏటిఎం. జగన్ కు మోది ఒక ఏటిఎం,  కెసిఆర్ ఇంకో ఏటిఎం అని అయన అన్నరు. మంగళవారం అయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఏటిఎంలకు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు మోది ఘనతే. మోది మెడలో కూడా త్వరలోనే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు  వుంటుంది. పెద్దనోట్ల రద్దును కుంభకోణంగా చేసింది మోది, షా లే. రైతులను,పేదలను బిజెపి నానాపాట్లు పెట్టింది. నల్లధనం నియంత్రణ ముసుగులో నల్లధనానికి గేట్లెత్తారు. 165 మంది మృతి చెందడం మోది నిర్వాకాలేనని ఆరోపించారు. తల్లిని చూడడు. భార్యను పట్టించుకోడు. బిడ్డల విలువ తెలీదు. కుటుంబ విలువలు లేని మోదికి పాలనా యోగ్యత ఎక్కడ అని ప్రశ్నించారు. అవినీతిపరులపై,నేరగాళ్లపై మోదికి ఎక్కడలేని ప్రేమ వుంది. అందుకే అటు కెసిఆర్ తో, ఇటు జగన్ తో మోది లాలూచి వుంది. నమ్మక ద్రోహం, నరమేధాల్లో దిట్ట నరేంద్రమోది. కుప్పం మహిళ వసంతమ్మ రాష్ట్రానికే స్ఫూర్తి. సామాను బైటపడేసినా పసుపు జెండా దించనంది. అద్దెకుండే వాళ్లపై వైకాపా నేతలు బరితెగించారు. జగన్ కు ఓటేయకపోతే సామాన్లు బైటేయడం అమానుషమని అయన అన్నారు. గాజువాకలో గర్భిణీ మహిళపై దౌర్జన్యానికి జగన్ సిగ్గుపడాలి. పిడుగురాళ్లలో వృద్ద దంపతులపై దౌర్జన్యం సిగ్గుచేటు. వైకాపాకు ఓటేస్తే మన ఇళ్లల్లో మనం అద్దెకుండాల్సిందే. జగన్ కు, జగన్ తాబేదారులకు అద్దెలు చెల్లించాల్సిందే. పులులు, సింహాలు  క్రూరమృగాలు అడవిలోనే ఉండాలి. సింహం ఒక్కటే వస్తుందనే జనం భయం. క్రూరమృగాల పార్టీ వైకాపా అనేదే ప్రజల భయమని యమమల అన్నారు. జగన్ తాత రాజారెడ్డి  క్రూరత్వంతో పులివెందుల బెంబేలు ఎత్తింది. క్రూరత్వంలో జగన్మోహన్ రెడ్డి తాతనే మించిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ‘‘ఇడి అమీన్’’ కు తేడా లేదు. అతను నరమాంస భక్షకుడు, ఇతను మేన్ ఈటర్. జనాన్ని చంపేసే కూరమృగాలకు ఎన్నికలెందుకు..? కూరమృగాల పార్టీ వైకాపాకు ఎవరైనా ఓట్లేస్తారా..? ముఖ్యమంత్రి పుట్టిన తేదిపై జగన్ అవాకులు, చవాకులు వాగుతున్నాడు. 12 ఛార్జిషీట్లలో ఎనిమిదింటిలో జగన్ పై 420 ఉంది. మోసం( 420), నమ్మకద్రోహం (120 బి) సెక్షన్లు ఉంది జగన్ పైనే. 31కేసులతో దాఖలు చేసిన అఫిడవిట్  జగన్ కు సిగ్గుచేటు. జగన్ అఫిడవిట్ చూసిన ఎవరూ వైకాపాకు ఓటేయరని అయన అన్నారు. 

Related Posts