YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ నయా స్కీమ్ ఐదు అంశాలకు ప్రాధాన్యం

కాంగ్రెస్  నయా  స్కీమ్ ఐదు అంశాలకు ప్రాధాన్యం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ పార్టీ  రిలీజ్ చేసిన త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో అయిదు అంశాల‌కు విశిష్ట స్థానం క‌ల్పించింది. న్యాయ్ స్కీమ్‌తో నిరుపేద‌ల‌కు క‌నీస ఆదాయం క‌ల్పిస్తామ‌ని రాహుల్ అన్నారు. ప్ర‌తి అకౌంట్‌కు మోదీ 15 ల‌క్ష‌లు ఇస్తాన‌న్నారు, కానీ అదో అబ‌ద్దం అని తేలింది, పౌరుల‌కు ఎంత ఇవ్వ‌గ‌ల‌మో పార్టీ నేత‌లంతా క‌లిసి నిర్ణ‌యించామ‌ని, పేద‌రికంపై యుద్ధం చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, అందుకే ప్ర‌తి పేద కుటుంబానికి ఏడాదికి 72వేలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. ఇక ప్ర‌భుత్వం ఉద్యోగాన‌లను భ‌ర్తీ చేయ‌డం రెండ‌వ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న రెండ‌వ అతిపెద్ద స‌మ‌స్య అన్నారు. 22 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. వాటిని వెంట‌నే పూర్తి చేయాల‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మ‌రో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం మూడ‌వ టార్గెట్‌. మొద‌టి మూడేళ్ల వ‌ర‌కు కంపెనీలు పెట్టుకునే వారు ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వారికి ప‌న్ను మిన‌హాయింపుల‌ను కూడా క‌ల్పించ‌నున్నారు. జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప్ర‌స్తుతం వంద రోజుల‌కు ప‌ని దినాల‌ను క‌ల్పిస్తున్నారు. దాన్ని ఇప్పుడు 150 రోజుల‌కు పెంచ‌నున్న‌ట్లు రాహుల్ చెప్పారు. రైతుల కోసం ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్ట‌నున్న‌ట్లు రాహుల్ చెప్పారు. రైల్వే బ‌డ్జెట్ త‌ర‌హాలో ప్ర‌త్యేకంగా రైతుల‌కు బ‌డ్జెట్ స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు రాహుల్ చెప్పారు. రుణాలు చెల్లించ‌లేని రైతుల‌పై క్ర‌మిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోమ‌న్నారు. మొహుల్ చోక్సీ, విజ‌య్ మాల్యాలు దేశం విడిచి ప‌రార‌య్యారు, కానీ రైతులు మాత్రం జైలుపాల‌వుతున్నారు, అయితే రుణాలు చెల్లించ‌లేక‌పోతున్న రైతులపై నేరాభియోగం ఉంద‌ని రాహుల్ అన్నారు. జీడీపీలో ఆరు శాతాన్ని విద్య కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌ల‌ను అందిచ‌నున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న జీఎస్టీ స్థానంలో జీఎస్టీ 2.0ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. స్టాండ‌ర్డ్ రేట్ ఆధారంగా ట్యాక్సుల‌ను వ‌సూల్ చేస్తామ‌న్నారు. తాను ప్ర‌ధాని అయ్యే అంశం ప్ర‌జ‌ల‌పై ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజే రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ చేప‌డుతామ‌న్నారు.

Related Posts