Highlights
- దుబాయ్ పోలీసులకు అందిన శ్రీదేవి ఫోరెన్సిక్ నివేదిక
- శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం జారీ
- గుండెపోటుతోనే ఆమె చనిపోయిందన్న పోలీసులు
- రాత్రి పది గంటల తర్వాత ముంబై భౌతికకాయం
- రేపు ఆమె అంత్యక్రియలు
ప్రముఖ నటి శ్రీదేవి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని, గుండెపోటుతోనే ఆమె చనిపోయిందని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. శ్రీదేవికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక దుబాయ్ పోలీసులకు అందింది. శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు.
శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ కు తరలింపు ఏర్పాట్లకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొద్దిసేపట్లో ఆమె భౌతిక కాయాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
సోమవారం రాత్రి పది గంటల తర్వాత ఆమె మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్టు సమాచారం. కాగా, ముంబైలోని శ్రీదేవికి చెందిన భాగ్య బంగ్లాలో అభిమానుల సందర్శన నిమిత్తం ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.