
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఐపీఎల్ తాజా సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఖాతా తెరిచింది. ఆల్‌రౌండ్ షో కనబరిచిన ఈ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. బౌలింగ్‌లో శ్రేయాస్ గోపాల్ (3/12).. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ (43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) ఈ విజయంలో కీలకంగా నిలిచారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (67), మార్కస్ స్టొయినిస్ (31) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత రాజస్థాన్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. స్టీవ్ స్మిత్ (38), త్రిపాఠి (34 నాటౌట్) రాణించారు. చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రేయాస్ గోపాల్ నిలిచాడు.