యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలు ప్రచారంలో ఎవరీ పంధాలో వారు విశేష ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి మాకీనిడి శేషుకుమారి తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈ సంధర్భంగా పట్టణంలోని 1, 2, 30 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఆమె ఓటర్లుతో మాట్లాడుతూ పాలన మారాలంటే పవన్ రావాలని, ప్రతీ ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును పార్టీ గుర్తైన గాజు గ్లాసుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండలంలోని నవఖండ్రవాడ, కొండెవరం గ్రామంలో తమ ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విరవాడకు చెందిన యువకులు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.