యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా ఎన్నికల ప్రచార హోరు జోరు గా సాగుతోంది. బుధవారం వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి మండలం లోని ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రకటించిన నవరత్నాలు వివరించారు. ఈ ఎన్నికల్లో తప్పక వైయస్సార్ సిపి ని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఎర్రబాలెం గ్రామ కూడలిలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా కరకట్ట దగ్గర ఒక ఇంటిని ఆక్రమించుకొని నివసిస్తున్నాడని తన ఇంటికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రబాలెం గ్రామాన్ని ఇంతవరకు చూడలేదనో అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని , నియోజకవర్గాన్ని ఎం అభివృద్ధి చేస్తాడని విమర్శించారు. ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ కి జయంతికి వర్ధంతి కీతేడా తెలియదని ఎద్దేవా చేసారు. లోకేష్ కు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఎప్పుడు రిజల్ట్ ప్రకటిస్తున్నారో కూడా తెలియదని, అటువంటి వ్యక్తి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్ముతాం అని ప్రజలను ప్రశ్నించారు. నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి అక్రమంగా గా నివాసం ఉంటూ ఏరోజైనా నా తన పక్కనే ఉన్న ఎర్రబాలెం గ్రామాన్ని దర్శించారా అని అడిగారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే వై ఎస్ ఆర్ సి పి పార్టీని గెలిపించాలని ఓటర్లును అభ్యర్థించారు.