యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశానికి దిశానిర్ధేశం చేసే నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యపడుతుందని బిజెపి పార్లమెంట్ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం ఉదయం ఆమె తన ప్రచారాన్ని భీమిలి నియోజకవర్గంలో నిర్వహించారు. ఉదయం సింహచలం నుంచి భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్ధి కోరాడ అప్పారావుతో కలసి తన ప్రచారం జరిపారు. అవినీతి రహిత పాలనను అందించడం బిజెపికే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. గతంలో ఎంపిగా పనిచేసిన సమయంలో ఎంపీ నిధులతో భీమిలి నియోజకవర్గం పూర్తిస్ధాయిలో అభిశృద్ధి చేయాడానికి కృషిచేసానన్నారు. మహిళలకు, రైతులకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతులకు ఇంకా రెండు విడతల రుణమాఫీ జరగాల్సి ఉందని, ఇది జరగకపోవడంతో రైతులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారన్నారు. రైతు రుణమాఫీ జరగలేదని, డ్వాక్రా మహిళలకు ఒక్కోక్కరికి రూ 32 వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. దీనికి కప్పిపుచ్చుకుని నేడు పసుపు కుంకుమ పేరుతో రూ 10 వేలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని, జన్మభూమి కమిటీల చేతులు తడిపితేనే పథకాలు అందే పరిస్థితి ఉందన్నారు. బిజెపి శాసన సభ అభ్యర్ధి కోరాడ అప్పారావును గెలిపించి శాసన సభకు పంపాలని కోరారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ 6 వేలు చొప్పున వారి ఖాతాలకు అందించే ప్రయత్నం చేస్తోందన్నారు. సింహాచలం గోశాల కోనేరు, సింహాచలం, అడవివరం, నీళ్లకుండీలు, పద్మనాభం మండలం, రెడ్డిపల్లి, చిన్నాపురం, మంగమారిపేట, విబిసి కాలనీ, నగరంపాలెం జంక్షన్, చాపలుప్పాడ, నడిగట్టు, నేరెళ్లవలస, భీమిలి నూకాలయ్య గుడి తదితర ప్రాంతాలలో ఆమె ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బిజెపి కార్యక్రర్తలు,నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజ్ బహదూర్, శివాజి, జిసి నాయుడు, ఫణి, పద్మజ, శ్రీకాంత్, కె.రామరాజు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.