YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఆధార్‌ లింకేజ్‌: కేంద్రం తీరుపై రాహుల్‌ విమర్శలు

ఆధార్‌ లింకేజ్‌: కేంద్రం తీరుపై రాహుల్‌ విమర్శలు

వ్యక్తిగత గోప్యత విషయంలో కీలకంగా మారిన ఆధార్‌ కార్డుపై సుప్రీంకోర్టు తన విచారణను గురువారం కొనసాగించనున్న నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయంగా వాడీవేడి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాహుల్‌గాంధీ ‘ఆధార్‌’ విషయంలో మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. యూపీఏ హయాంలో ఆధార్‌ ఎలా ఉండేది.. ఎన్డీయే హయాంలో ఎలా మారింది అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. యూపీఏ హయాంలో దేశపౌరుల సాధికారితకు స్వచ్ఛంద సాధనంగా ఆధార్‌ ఉండగా.. ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చేసరికి దేశపౌరులను బలహీనులను చేసే బలవంతపు ఆయుధంగా ఆధార్‌ మారిపోయిందని విమర్శించారు.

కనీస సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాహుల్‌ కేంద్రంపై ఈ విమర్శలు చేశారు. బ్యాంకులు, మొబైల్‌ఫోన్లు, పాన్‌కార్డులు, ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని ప్రభుత్వం కచ్చితం చేసేదిశగా సాగుతున్న సంగతి తెలిసిందే.

Related Posts