Highlights
- బ్యాగులో ఉంచిన పవర్ బ్యాంక్ పేలుడు
- భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు
- మంటలను ఆర్పివేసిన సిబ్బంది
చైనా సదరన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైన విమానంలోంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. ప్రయాణికులు ఇంకా విమానం ఎక్కుతుండగానే ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్ లో ఉంచిన బ్యాగులోని మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఉపయోగించే పవర్ బ్యాంక్ పేలిపోయింది. దాంతో బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే, వెంటనే స్పందించిన విమాన సిబ్బంది వాటర్ బాటిల్ నీళ్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. పవర్ బ్యాంక్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అయితే, ఉపయోగించకుండా ఖాళీగా బ్యాగులో ఉంచిన సమయంలో ఇది పేలడం చర్చనీయాంశమైంది. ఇది ఎందుకు పేలిందనే దానిపై పరిశీలన జరుపుతున్నామని అధికారులు తెలిపారు.