యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 39వేల మార్కును అధిగమించిన మరుసటి రోజే మార్కెట్లు నష్టపోయాయి. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ 'స్కైమెట్' సంస్థ చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికి తోడు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... చివరి రెండు గంటల్లో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 38,877కు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,643 వద్ద స్థిరపడింది