YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

8న తెలంగాణ, 12న ఆంధ్రా ఇంటర్ ఫలితాలు

 8న తెలంగాణ, 12న ఆంధ్రా  ఇంటర్ ఫలితాలు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 13న విడుదలచేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9, 42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెలవులు ముగిసిన తర్వాత జూన్‌ 1 నుంచి 2019-20 విద్యాసంవత్సరానికి తరగతులను ప్రారంభంకానున్నాయి. 
ఏపీలో ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు? 
ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశలో ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మూల్యాంకనం పూర్తయితే ఏప్రిల్‌ 12న ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో జూన్ 2 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 3న కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి

Related Posts