Highlights
- అది నా లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్
- ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అర్థమైంది
- కమెడియన్ వేణు
- వాళ్లు కోరినట్టుగా సారీ చెప్పేశాను
- తరువాత స్కిప్ట్ కు జాగ్రత్తపడ్డా
నిజానికి నేనే తప్పూ చేయలేదు .. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే .. ఒకవేళ నేను తప్పుచేసి వుంటే సారీ చెప్పడానికి వెనుకాడను" అన్నాడు అంటున్నాడు కమెడియన్ వేణు. ఇటీవల 'జబర్దస్త్' వేదికపై వేణు చేసిన ఒక స్కిప్ట్ ఒక వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించింది .. దాంతో వాళ్లు ఆయనపై దాడి చేశారు. ఓ ఛానల్ ఇంటార్వ్యులో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు వేణు తీవ్రంగా స్పందించాడు."నేను తప్పు చేయకపోయినా .. కొంతమంది రియాక్టయ్యారు .. వాళ్లు నా నుంచి సారీ కోరుకున్నారు .. చెప్పేశాను. ఈ విధంగా జరగడం వలన ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం నాకు అర్థమైంది. ఏ స్కిప్ట్ చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చేయాలనే విషయం స్పష్టమైంది. ఆ రోజున నేను చేసిన స్కిప్ట్ కూడా .. నా లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. దానిని దృష్టిలో పెట్టుకుని ఆ స్కిప్ట్ చేశాను .. ఫలితంగా నా పై దాడి జరిగింది" అని చెప్పుకొచ్చాడు.