YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: నరేందమ్రోదీ

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: నరేందమ్రోదీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని ప్రధానమంత్రి నరేందమ్రోదీ దుయ్యబట్టారు.అది అబద్ధాల, కపటపూరిత మేనిఫెస్టో అని విమర్శించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు సియాంగ్‌ జిల్లా పాసిఘాట్‌ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘కాంగ్రెస్‌ ప్రతిసారి అబద్ధపు హామీలే ఇస్తుంది. 2009 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని 2004లో హామీ ఇచ్చింది. కానీ 2014 వరకు 18000 గ్రామాల్లో విద్యుత్‌ సదుపాయం లేదు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి హామీలే ఇస్తోంది. ప్రజలను తెలివితక్కువ వారిని చేసేందుకు అబద్ధాలతో మేనిఫెస్టో తయారుచేసింది. అది మేనిఫెస్టో కాదు. అబద్ధాల పుట్ట. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుంది. కానీ మేం ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం భాజపా కట్టుబడి ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను తూర్పు ఆసియాకు గేట్‌వేగా మారుస్తాం. మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇందుకోసం ఎదురయ్యే సవాళ్లను సవాల్‌ చేస్తూ ముందుకెళ్తాను’ అని మోదీ చెప్పుకొచ్చారు.రైతులను మోసం చేసి ఓట్లు అడిగే పార్టీ తమది కాదని మోదీ ఈ సందర్భంగా అన్నారు. వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి.. నిబద్ధతకు, కుట్రకు మధ్య జరుగుతున్న పోరు అని మోదీ తెలిపారు.

Related Posts