YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బెంగుళూర్ దే టైటిల్... సెంటిమెంట్ పనిచేస్తుందా

బెంగుళూర్ దే టైటిల్... సెంటిమెంట్ పనిచేస్తుందా
ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుసగా నాలుగు ఓటములతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అభిమానుల్ని నిరాశపరిచింది. కానీ.. ఆ జట్టుకి ఇప్పటికీ టైటిల్ గెలిచే అవకాశాలున్నాయని 2015 ఐపీఎల్ సీజన్‌ని ఉటకిస్తూ కొందరు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌ కూడా ఇలానే తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది.. కానీ.. ఆ తర్వాత జోరందుకున్న రోహిత్ సేన.. వరుస విజయాలతో ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తాజా సీజన్‌లో బెంగళూరు అదే బాటలో పయనిస్తోందంటూ అభిమానులు సోషల్ మీడియాలో జోస్యం చెప్తున్నారు. ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోగా.. 2019 ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో బెంగళూరు కూడా సరిగ్గా 7 వికెట్ల తేడాతోనే ఓడిపోయింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ బెంగళూరు జట్టు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. తాజా సీజన్‌లో ఆ జట్టు ఐదో మ్యాచ్‌ను బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం ఆడనుంది. 

Related Posts