YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

 హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Highlights

  • రేపటి నుంచి  ప్రిన్స్‌ ఆగాఖాన్‌ నగర పర్యటన 
 హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

 ప్రిన్స్‌ ఆగాఖాన్‌ మంగళ, బుధవారాల్లో నగరంలో పర్యటించనున్నారు. నిజాం కళాశాలలో జరిగే కార్యక్రమం కోసం ఆయన పర్యటన జరుగనుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 
ఈ సందర్భంగా రెండు రోజులపాటు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిజాం కళాశాల పరిసరాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తామన్నారు. 
ఎ.ఆర్‌.పెట్రోల్‌ పంప్‌ దగ్గర నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు. 
ఆబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి బీజేఆర్‌ కూడలి వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ దగ్గర నుంచి చాపెల్‌ రోడ్డుకు మళ్లిస్తారు. 
బషీర్‌బాగ్‌ కూడలి నుంచి ఆబిడ్స్‌ జీపీవో వైపు వెళ్లే వాహనాల్ని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి కింగ్‌కోఠి రోడ్డు మీదుగా పంపిస్తారు. 
పాత ఎమ్మెల్యే క్వార్టర్ల వైపు నుంచి బషీరాబాగ్‌ వైపు వాహనాలను అనుమతించరు. వాటిని హిమాయత్‌నగర్‌ వై కూడలి వైపు పంపిస్తారు. 
లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వెళ్లే వాహనాల్ని హిమాయత్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు. ః పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వెళ్లే వాహనాల్ని బషీర్‌బాగ్‌ మీదుగా లిబర్టీ వైపు పంపిస్తారు. 
కింగ్‌కోఠి కూడలి నుంచి బషీర్‌బాగ్‌ వెళ్లాల్సిన వాహనాల్ని సిమెట్రీ వైపు మళ్లిస్తారు.
ఆగాఖాన్‌ పర్యటన మార్గాలు ఇలా.. 
 26న మధ్యాహ్నం 2.35 గంటల నుంచి 3.20 గంటల మధ్య ఆగాఖాన్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా హోటల్‌కు ప్రయాణిస్తారు. శంషాబాద్‌ ప్రయాణప్రాంగణం - ఆరాంఘర్‌ క్రాస్‌ రోడ్డు- లక్ష్మీగూడ ‘టి’ కూడలి- పల్లెచెరువు కల్వర్టు- బండ్లగూడ క్రాస్‌ రోడ్డు- ఫలక్‌నుమా రైల్వే వంతెన మార్గంలో ప్రయాణిస్తారు.
27న ఉదయం 10.05 గంటల నుంచి 11.00 గంటల మధ్య ఫలక్‌నుమా నుంచి బండ్లగూడ క్రాస్‌ రోడ్డు- ఆరాంఘర్‌ కూడలి- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే- మాసబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌- నిరంకారి భవన్‌- ఖైరతాబాద్‌ కూడలి మీదుగా రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం 11.15 గంటల నుంచి 12.20 గంటల మధ్య అదే మార్గంలో తిరిగి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళతారు.
 అదే రోజు మధ్యాహ్నం 3.10-4.10 గంటల మధ్య ఫలక్‌నుమా ప్యాలెస్‌ నుంచి ఆరాంఘర్‌ కూడలి- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే- తెలుగుతల్లి- లిబర్టీ కూడలి మీదుగా బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాలకు వెళతారు. సాయంత్రం 5.45-6.45 గంటల మధ్య నిజాం కళాశాల నుంచి రవీంద్రభారతి- మాసబ్‌ట్యాంక్‌- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే- ఆరాంఘర్‌ కూడలి- దుర్గానగర్‌- లక్ష్మీగూడ టి కూడలి- హషామాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ వెళతారు.
28న ఉదయం 9.55- 10.55 గంటల మధ్య మరోసారి అదే మార్గంలో నిజాం కళాశాలకు వెళతారు. మధ్యాహ్నం 12.15- 13.15 గంటల మధ్య నిజాం కళాశాల నుంచి రవీంద్రభారతి- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే- గగన్‌పహాడ్‌ మీదుగా విమానాశ్రయం చేరుకుంటారు.

Related Posts