యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడిని ప్రతీరోజూ పూజించడం ద్వారా కష్టనష్టాలను దూరం చేసుకోవచ్చు. దారిద్ర్యాలను తొలగించుకోవచ్చు. ఈతిబాధలను నశింపజేసుకోవచ్చు. అలాంటి మహిమాన్వితమైన దేవదేవుడిని ప్రతిరోజూ పూజించడానికి వీలులేకపోయినా.. మాసంలో వచ్చే మాసశివరాత్రి రోజున పూజించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చునని పండితులు అంటున్నారు.
మాస శివరాత్రి రోజున పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన మాసమంతా ఆయనని సేవించిన ఫలితం లభిస్తుంది.
ప్రదోష కాలమున
(సా: 5.30-7.30)
ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.
*"ఓం నమఃశివాయ,* *నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ,* *మహాదేవాయ,* *త్రయంబకాయ,* *త్రిపురాంతకాయ,* *త్రికాగ్నికాలాయ,* *కాలాగ్ని రుద్రాయ,* *నీలకంఠాయ,* *మృత్యుంజయాయ,* *సర్వేశ్వరాయ,* *సదాశివాయ,*
*శ్రీ మన్మహాదేవాయ నమః".*
అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు. లేక
*"ఓం నమఃశివాయ"* అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.
*శివమానసపూజ స్తోత్రం*
ఆది శంకరాచార్య
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||
నేడు శ్రాద్ధ తిథి *ఫాల్గుణ కృష్ణ/బహుళ చతుర్ధశి*
*ధర్మస్య విజయోస్తు,*
*అధర్మస్య నాశోస్తు,*
*ప్రాణిషు సద్భావనాస్తు,*
*విశ్వస్య కళ్యాణమస్తు.*
*లోకాస్సమస్తా స్సుఖినోభవంతు*