YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పాండ్యా ఆల్‌రౌండ్‌ షో.. చెన్నైవిజయాలకు ముంబై బ్రేక్‌

పాండ్యా ఆల్‌రౌండ్‌ షో.. చెన్నైవిజయాలకు ముంబై బ్రేక్‌

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

సొంతగడ్డపై ముంబై మురిసింది. హార్దిక్‌ పాండ్యా (8 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 59) అర్ధ శతకంతో ఆదుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 170/5 స్కోరు చేసింది. క్రునాల్‌ పాండ్యా (32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 42) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో చెన్నై ఓవర్లన్నీ ఆడి 133/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ (3/20), బెహ్రెన్‌డార్ఫ్‌ (2/22) చెన్నైను వణికించారు. కేదార్‌ జాదవ్‌ (58) హాఫ్‌ సెంచరీ సాధించాడు. లీగ్‌లో ముంబైకిది రెండో గెలుపు కాగా.. చెన్నైకి తొలి ఓటమి.

Related Posts