YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రైతులకు అవగాహన కల్పించిన సదస్సు 

Highlights

  •  బాపట్లలో జాతీయ సదస్సు 
  • రెండు రోజుల పటు రైతులకు అవగాహన 
రైతులకు అవగాహన కల్పించిన సదస్సు 


రైతులకు వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించటంతోపాటు వాటిని ఉపయోగించుకునే విధంగా ప్రోత్సహించే దిశగా జాతీయ సదస్సు సాగింది. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్  కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో  వివిధ ప్రాంతాల నుంచి తరలించిన వివిధ యంత్రపరికరాలను ప్రదర్శించారు. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌, రాష్ట్ర వ్యవసాయ విభాగం, జాతీయ వ్యవసాయ ఇంజనీరింగ్‌ సమాజం, ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో యంత్ర పరికరాలతో  ప్రయాత్మకంగా  అవగాహన కల్పించారు. మూడురోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో భాగంగా  తోలి రోజైన సోమవారం  1500మంది రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా శాటిలైట్‌ ద్వారా భూమిలోని నాణ్యతను తెలుసుకొని అక్కడ ఏవిధమైన వ్యవసాయం చేయాలో నిర్ధారించటం, ఇంజనీరింగ్‌ సాంకేతికతపై ఈ  జాతీయ సదస్సునుఏర్పాటు చేశారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే  ఈ  జాతీయ సదస్సు నిర్వాహణ అంశాన్ని  కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎ.మణి, యూనివర్సిటి అగ్రికల్చర్‌ డీన్‌ డాక్టర్‌ డి.భాస్కరరావు శాస్త్రవేత్తలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సదస్సుతో పాటు 3 రోజులపాటు వ్యవసాయ యంత్ర ప్రదర్శనకు కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 26, 27, 28 తేదీలలో యంత్రప్రదర్శన ఉంటుందని వారు తెలిపారు. వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించి ఆ దిగుబడికి విలువలను జోడించటం తద్వారా రైతులకు వ్యవసాయం లాభసాటిగా చేయటం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.

Related Posts