యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బుధవారం మైలవరం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ప్రవర్తించాడో రాష్ట్ర ప్రజలందరూ చూసారు.
పోలీసులు ఇచ్చిన రూట్ మాప్ లో కాకుండా వాళ్ళ సొంత రూట్లో వెళ్లి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను రెచ్చకొట్టి పోలీసులు మీద దాడి చేపించారు. పోలీసులు మీద రాళ్లు, చెప్పులు విసరడం వంటింవి చేస్తుంటే వాటిని పోలీసులు ఆపారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో మైలవరంలో ఇలాంటి గొడవలు చూడలేదు. ఇలాంటి వాళ్లాకా మనం ఓటు వేయాల్సింది. లోటస్ పాండ్ లో కుర్చీని జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్ని చేశారని అయన అన్నారు. మైలవరంలో నిన్న వాళ్ళు ప్రవర్తించిన తీరుకు సభ్యసమాజం తీవ్రంగా కండిస్తుంది. ఒడిపోతాం అనే భయంతో ఇలాంటి దాడులకు పలుపడటం వారి అరచకాని నిదర్శనం.
నిన్న అధికారులు సూచించిన దారిలో రాకుండా కార్యకర్తల మధ్యలో నుంచి వచ్చి వాళ్ళని రెచ్చగొట్టే లాగా మాట్లాడి ఇలాంటి దాడులు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేపించారు. జగన్ పులివెందులకు నీళ్లు ఇచ్చాము అని, అతని అవినీతిని ప్రశింతున్నాము అని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ 5000 కోట్ల రూపాయలతో చింతలపూడి నుంచి జూన్ , జులై 2019 కల్లా నీళ్లు ఇస్తాం. కేవలం చంద్రబాబు గారిని, దేవినేని ఉమా ని తిట్టడానికే మైలవరం వచ్చారు. ఎలక్షన్ కమిషన్ నిన్న మైలవరం లో జరిగిన దాడి మీద వెంటనే స్పందించాలి. నిన్న జరిగిన దాడి ప్రజల పైన జరిగిన దాడి. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని అయన అన్నారు. అధికారంలోకి రాకుండానే ఇలాంటి దాడులు చేస్తున్నారే నిజంగా వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎమ్ చేస్తారు. కేవలం నన్ను , చంద్రబాబు గారిని తిట్టడానికే మైలవరం సభ పెట్టుకున్నారు కానీ ప్రజలకు ఎమ్ చేస్తారో చెప్పలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి, ఒక మానసిక రోగంతో బాధపడుతున్నాడు. సభా వేదిక పై నుంచి జగన్మోహన్ రెడ్డి దిగగానే అతని కార్యకర్తలు crpf పోలీసులు మీద దాడి చేశారు అంటే ఎంత కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రాకుండా కేసీఆర్ అడ్డుకుంటుంటే అలాంటి కేసీఆర్ మంచోడు అంటున్నాడు.
కేసీఆర్, మోదీ గొప్పవారు అని జగన్ మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపమని కేసీఆర్ కూతురు, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో కేసులు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా కేసీఆర్ ని సమర్దింస్తున్నావని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రానికి, పోలవరానికి ఎలా సహకరిస్తారో దీని పైన ప్రజలకు కచ్చితంగా వివరణ ఇవ్వాలి. వైసీపీ కి వేసే ప్రతి ఓటు పోలవరానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులకు వేసినట్టే. ఈ వారం రోజులు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి, వైసీపీ నాయకులు ఇలాంటి దాడులు చేయడానికి చూస్తున్నారని హెచ్చరించారు.