యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి అన్నారు.సార్వత్రిక ఎన్నికల ఇంటింటి ప్రచారం లో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న బిజెపి నాయకులకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు.బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి, సతీమణి కె.ఆర్ మంజుల, కార్యకర్తల బృందం గురువారం పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.అందులో భాగంగా ప్రజలు ఆయనతో మాట్లాడుతూ వారి, వారి సమస్యలను తెలియజేశారు.మా వార్డు నందు త్రాగునీటి సమస్య మురికి కాలువల సమస్య ఉంది అని, పెన్షన్లు పొందాలంటే లంచం ఇస్తే గాని మాకు పెన్షన్ లు రావడం లేదని సమస్యలను తెలియజేశారు.ప్రజల సమస్యలు విన్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి కి హామీ ఇస్తూ నియోజకవర్గంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి వార్డులోని ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.కె.ఆర్ మురహరి రెడ్డి సతీమణి కె.ఆర్ మంజుల మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా భర్తను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. పట్టణంలోని 26వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ కరపత్రాలను అందించి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.