యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మెదక్ పార్లమెంటు అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెరాస నంగునూరు మండల పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. నంగునూరు మండల పరిధిలోని ముండ్రాయి, రాజగోపాల్ పేట గ్రామాల్లో గురువారం ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. లక్షే మన లక్ష్యం అంటూ ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఆయాగ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. పించన్లు ఇస్తున్న పెద్ద కొడుకు సియం కేసీఆర్ అంటూ, తామున్నంతకాలం మరిచిపోమంటూ పలువురు ప్రచారానికి వెళ్లిన నాయకులతో అనడం కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలతోమా గ్రామల చెరువులు నింపుబోతున్న హరీశ్వరుడు మాకు చిన్నకొడుకు అంటూ మరి కొందరు గుర్తుచేశారు. సియం కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీఅని మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో గ్రామంలో ప్రచారానికి వెళ్లిన తెరాస శ్రేణులకు బొట్టు పెట్టి ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు నాయకులకు భరోసా ఇచ్చారు. అంతే కాదు. సియం కేసీఆర్ నాయకత్వంలో హరీశ్ రావు పూర్తి సహకారంతోనంగునూర్ మండలంలోపారిశ్రామిక అభివృద్ధి కి అడుగులు పడుతున్నాయని ప్రచారంలో పాల్గొన్న నాయకులు అన్నారు. చెక్ డ్యాంలు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు,మండలం లో అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లు, లిఫ్ట్ ఇరిగేషను వ్యవస్థ, హాస్పిటల్, నూతన విద్యుత్ వ్యవస్థ, వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సదుపాయాలు మాజీ మంత్రి హరీశ్ రావు ఏర్పాటు చేశారని అన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లోకారు గుర్తుకే ఓటు వేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షులు అనగౌని లింగంగౌడ్, ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, ఏయంసి చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి రెడ్డి,పిఎసిస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ,దువ్వలమల్లయ్య, తడిసిన వెంకట్ రెడ్డి, రాసస అధ్యక్షుడు బద్దీపడగ కిష్టా రెడ్డి, మండల నాయకులు కూతురు రాజిరెడ్డి, కమలాకర్ రెడ్డి, కమాల్ షరీఫ్, రహీంపాషా,సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేముల కొండల్ రెడ్డి, సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి నాయక్, యేల రాజెంద్రా, ఎం
పిటిసి వెంకట్ రాజం, నాయకులు నాయిని పద్మారెడ్డి, మాజి ఎంపిటిసి గుండెల్లి రాజయ్య, మాజి సర్పంచ్ రాజిరెడ్డి, సంజీవ్, ఆకుబత్తిని రాము, గంప రాంచందర్ రావు, సత్యం, రంగు రాజు, యాదగిరి, చెలికాని మల్లేశం,పావురాలఅశోక్, వెంకన్న, చంద్రమౌళి, బెదురు తిరుపతి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి,మల్యాల నర్సింలు, నర్సిహ్మారెడ్డి, రాజు, ఆయా గ్రామాల వార్డు మెంబెర్స్, గ్రామాల నాయకుల ,యువత విద్యార్థి నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు