YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహం

Highlights

హెచ్ ఐ సీసీ లో ప్రారంభమైన 21వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్
సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి సీ ఆర్ చౌదరీ, 
మంత్రి కేటీఆర్, సీ ఎస్ ఎస్ కే జోషి
మంగళవారం టీ-యాప్ ఫోలియో ప్రారంభం 

డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహం

ఒకప్పుడు ఏదైనా సెర్టిఫికెట్ కావాలంటే... 20 నుంచి 30 రోజులు పట్టేది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ.. కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేదని .కేంద్ర మంత్రి సీ ఆర్ చౌదరి అన్నారు. హెచ్ ఐ సీసీ లో ప్రారంభమైన 21వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్స సదస్సును ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చౌదరి మాట్లాడుతూ.. కానీ... ఇప్పుడు నిమిషాల వ్యవధి లో అప్లై చేసుకోవచ్చు.. రెండు మూడు రోజుల్లో ఏ సర్టిఫికెట్ అయినా తీసుకోవచ్చని చెప్పారు.  ఇందుకు దేశంలోని లక్షా పది వేల గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో డిజిటలైజేషన్ లో భాగంగా... డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహిస్తున్నామన్నారు.  కొన్ని రాష్ట్రాలు మినహా  అన్ని రాష్ట్రాల్లో  రేషన్ కార్డులు ఆధార్ తో లింక్ చేశామని చెప్పారు. బయోమెట్రిక్ విధానం తో... రేషన్ సరఫరా లో అక్రమాలకు చెక్ పెట్టామని చెప్పారు. వీలైనంత తొందరగా పారదర్శకంగా.. పౌర సేవలు అందించినపుడే ఈ-గావర్నెన్స్ విజయవంతమైందని భావించాలన్నారు. ల్యాండ్ రికార్డ్స్ తో పాటు ప్రతీ పౌర సేవలను ఆన్ లైన్ చేస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లా... ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంపార్టెంట్ అని స్పష్టం చేశారు. 
ఈ గోవేర్నెన్స్ అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ఇట్ శాఖ మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు.ఎంతటి టెక్నాలజీ అయిన. ఏ సైన్స్ అయిన. సామాన్యుడికి ఉపయోగపడకపోతే అది వేస్ట్. అని గుర్తు చేశారు.టెక్నాలజీని అందిపుచ్చుకుని.. పౌర సేవలను ప్రజలకు సులభతరం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ టీఐ ఎం-వ్యాలెట్ ను 3 నెలల్లో నే 13 లక్షల మంది వినియోగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో 4500 మీసేవా కేంద్రాలు ఉన్నాయని తద్వారా  ఇప్పటివరకు 10 కోట్ల ట్రాన్సక్షన్స్ జరిగాయన్నారు. మంగళవారం  టీ-యాప్ ఫోలియో ప్రారంభిస్తున్నాం.. 180 పౌర సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామన్నారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామన్నారు. ఇప్పటివరకు టీఎస్ ఐపాస్ ద్వారా లక్షా 20 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ కి వచ్చాయి.6 వేల కంపెనీలకు అనుమతులిచ్చామన్నారు. ఈజ్ అఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని పేర్కొంటూ..బిల్డింగ్స్ కి 21 రోజుల్లో ఆన్లైన్ లో అనుమతితులిస్తున్నామన్నారు. టెక్నాలజీ ని ఉపయోగించుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మైక్రోసాఫ్ట్ తో కలిసి అన్ని స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కి కంటి పరీక్షలు నిర్వహించనున్నామని, 60 రోజుల్లో ల్యాండ్ రికార్డ్స్ ని ఆన్లైన్ చేశాం.. ఆధార్ తో లింక్ చేశామన్నారు.టీ ఫైబర్ ద్వారా ప్రతీ ఇంటికి 15mbps స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతీ గ్రామపంచాయతీ కి 1gbps స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వనున్నామని చెప్పారు. 8 ఏళ్ళపాటు అమెరికా లో ఉన్నా.. కేవలం ఒకసారి మాత్రమే గవర్నమెంట్  ఆఫీస్ కి వెళ్ళానన్నారు. అక్కడ ప్రతీ గోవేర్నెమెంట్ సర్వీస్ ఆన్లైన్ లో ఉంటుందన్నారు. 
 

Related Posts