యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సైకిల్ స్టాండ్‌లో ఉండాలి... గ్లాసు టీ స్టాల్‌లో ఉండాలి... అయితే ఫ్యాన్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్ధి మార్గాని భరత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక 21, 22, 23 డివిజన్లల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఫ్యాన్ ఉంటుందని... అలాగే జగన్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే అందరి సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ఇన్నాళ్లకు జగన్ రూపంలో మన రాష్ట్ర ప్రజలకు దొరికారని, మంచి ఆలోచనలు, విధానాలు అమలు చేయాలనుకునే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నవరత్నాలు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. తాను ఎంపీగా విజయం సాధిస్తే తన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా రూపుదిద్దే ప్రణాళికను సిద్ధం చేశానని ఆయన తెలిపారు. గోదావరిలోని లంకల ఎత్తు పెంచి ఫైవ్ స్టార్ రిసార్ట్స్‌ను నిర్మిస్తామని, ఇరిగేషన్ శాఖ అనుమతితో క త్రిమ సరస్సుగా వృద్ధి చేసి, వాటర్ వరల్డ్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. గోదావరిలో స్పీడ్ బోట్లు, పారాచూట్ రైడింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హేవ్‌లాక్ బ్రిడ్జికి అనుసంధానంగా పర్యాటక కేంద్రంగా, పాదచారులకు, సైక్లింగ్‌కు వీలుగా ఈట్ స్ట్రీట్‌గా, ఫ్యాషన్ స్ట్రీట్‌గా అభివ ద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరిలోకి డ్రైనేజీ వాటర్ కలవకుండా చేస్తామన్నారు. ద్వారకా తిరుమలలో ద్వారకను తలపించేలా ఎమ్యూజ్‌మెంట్ పార్కుగా తీర్చిదిద్దే యోచన ఉందన్నారు. మోరంపూడి, వేమగిరి, బొమ్మూరు, లాలాచెరువు ఫ్లైవర్ బ్రిడ్జిలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరం హెరిటేజ్‌ని కాపాడేలా హేవ్‌లాక్‌బ్రిడ్జి, బొమ్మూరు కాటన్‌గ హం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం ఇలా అన్నింటిని క్రోడీకరించి సాంస్క తిక వైభవాన్ని పరిరక్షించే చర్యలు చేపడతామని వివరించారు. రాజమహేంద్రవరం-కాకినాడ జంటనగరాలుగా అభివ ద్ధి చేస్తానన్నారు.