యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో గురువారం (ఏప్రిల్ 4) ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపైకి మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.