YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి అరబ్ ఏమిరేట్స్ అత్యున్నత పురస్కారం

 మోడీకి అరబ్ ఏమిరేట్స్ అత్యున్నత పురస్కారం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్‌తో ప్రధాని మోదీని సత్కరించాలని నిర్ణయించింది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ ఈ అవార్డును మోదీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. ఇండియా, యూఏఈ మధ్య సంబంధాలను బలోపేతం చేసిన కారణంగా మోదీకి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. వాటిని మోదీ మరోసారి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయను యూఏఈ అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించారు అని క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.మోదీ కంటే ముందు ఈ ప్రతిష్టాత్మక అవార్డును రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (2007), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (2018), సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (2016) అందుకున్నారు. గత నాలుగేళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి 2015 ఆగస్ట్‌లో యూఏఈ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత 2016లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఇండియాకు వచ్చారు. 2018లో మోదీ మరోసారి యూఏఈ వెళ్లారు. దుబాయ్‌లో జరిగిన ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా మోదీ హాజరయ్యారు.

Related Posts