YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇవీఎంలను పరిశీలించిన కలెక్టర్

 ఇవీఎంలను పరిశీలించిన కలెక్టర్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 పోలింగ్ కు సంబందించిన ఇవియం, వివిపాట్ యంత్రాలను క్షుణ్ణంగా తణిఖీ చేయాలని జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. చింతలపూడి  జూనియర్ కళాశాల ఆవరణలో ఇవియం, వివిపాట్ భద్రపరచిన స్రాంగ్ రూమ్ లను గురువారం ఆయన ఆకస్మిక తణిఖీ చేసారు. ఇవియం, వివిపాట్ యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్  కు సంబందించిన ఇవియం, వివిపాట్ లను పోలింగ్ సిబ్బందికి అందించే వరకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. స్టాంగ్ రూం పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకుండా 24 గంటల భద్రాతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబందించినవి వాటికే పంపాలని, ఆ విధంగా రిటర్నింగ్ అధికారులు ధృవీకరించుకోవాలన్నారు. ఇవియం, వివి పాట్  యంత్రాల వినియోగం పై పోలింగ్ సిబ్బందికి పూర్తి స్ధాయిలో శిక్షణఱ అందించాని, పోలింగ్ సమయంలో ఎక్కడా ఏ ఒక్క సమస్య ఎదురుకాకుండా రిటర్నింగ్ అధికారులు కింద స్ధాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ బృందాలతో ఎప్పటికప్పుడు పనులు ప్రగతిని సమిక్షించుకోవాలన్నారు. నియోజకవర్గ పరిథితో ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబందించి రిటర్నింగ్ అధికారి  దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణ మే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులలో పాల్గోనే సిబ్బంది అందరూ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ వివియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 5 వ తేదీన ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోలన్నారు.

Related Posts