YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కేంద్ర  వైఫల్యాలను ఎండకాడుతున్న రాహుల్ 

Highlights

  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ పై ధ్వజం 
  • కొనసాగుతున్న  రాహుల్ టెంపుల్ టూర్
కేంద్ర  వైఫల్యాలను ఎండకాడుతున్న రాహుల్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార సభల్లో ప్రధానంగా మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ  కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతన ప్రసంగాలకు పదును పెడుతున్నారు. సోమవారం రామ్దుర్గ్లోని గాడ్చి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. రామ్దుర్గ్లో ఎన్నికల ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటకలో మూడురోజుల పర్యటనలో భాగంగా పలు ప్రచార సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత పదిహేను రోజుల్లో రాహుల్ కర్ణాటక పర్యటన ఇది రెండవది కావడం గమనార్హం.కాగా  కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. సిద్ధరామయ్య సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts