YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అక్కరకు రాని ప్రియాంక ఛరిష్మా

అక్కరకు రాని ప్రియాంక ఛరిష్మా

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించే పరిస్థితి లేదని అంచనాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలనే సొంత చేసుకుంటుందని సర్వేలు సయితం వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అమేధీ, రాయబరేలి స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈసారి కూడా అవే స్థానాల్లో విజయం సాధిస్తుందని, మరొక్క స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు మాత్రమే కలసి కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కు అమేధీ, రాయబరేలీ స్థానాలను వదిలి మిగిలిన స్థానాల్లో ఈ రెండు పార్టీలు పంచుకున్నాయి. దీంతో కాంగ్రెస్ చేసేదేమీ లేక ఎస్పీ, బీఎస్ప అగ్రనేతలు పోటీ చేసే స్థానాలను మినహాయించి మిగిలిన స్థానాల్లో పోటీకి దిగుతోంది.ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు. ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతంలోని దాదాపు 39 స్థానాలకు ప్రియాంక గాంధీని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రియాంక రోడ్ షోలకు, సభలకు పెద్దయెత్తున జనం తరలి వస్తున్నప్పటికీ అవి ఓట్ల రూపంలో మారే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక్కడ బీజేపీ, బీఎస్పీ, ఎస్సీలు మాత్రమే తమ సత్తాను చాటతాయని తేలింది.మొత్తం 80 స్థానాల్లో ఈసారి బీజేపీకి కొంత ఎదురుగాలులు వీచే అవకాశమున్నట్లు ఏబీపీన్యూస్, నీల్సన్ సర్వే లో తేలింది. బీజేపీి 36 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశముంది. గత ఎన్నికల్లో బీజేపీకి 72 స్థానాలు దక్కాయి. అంటే బీజేపీ ఖాతాలో భారీ కోత పడే అవకాశముంది. బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి 42 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఈ సీట్లలో 20 సమాజ్ వాదీ పార్టీకి, 21 మాయావతి పార్టీకి, ఒకటి ఆర్ఎల్డీకి వస్తాయని ఈ సర్వే తేలింది. సో… ప్రియాంక వల్ల ‍యూపీలో పెద్దగా ఉపయోగం ఉండదని తేలింది. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూడాలి

Related Posts