YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు కునుకు లేకుండా చేస్తున్న జనసేనాని

జగన్ కు కునుకు లేకుండా చేస్తున్న జనసేనాని

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

వైసీపీ ఇప్పటివరకు తాము టీడీపీతోనే తలబడుతున్నామని అనుకుంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై గురిపెట్టింది. ప్రతి ఘటనకు చంద్రబాబునే గురిపెట్టి విమర్శలు చేశారు. అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు జరుగుతుందనుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది. జనసేన పార్టీని గుర్తించడానికి కూడా ఇష్టపడని జగన్.. ఇప్పుడు తన ప్రసంగాల్లో చంద్రబాబుకు కొంత ప్రాధ్యానత తగ్గించి పవన్‌కల్యాణ్‌కు పాధాన్యం ఇస్తున్నారు. ఇక వైసీపీ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేటాయించారు. అడపాదడపా పాల్‌పై జగన్‌ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే వైసీపీకి మొదటగా టీడీపీ అనుకుంటే జనసేన, ప్రజాశాంతి పార్టీలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. పర్చూరు నుంచి దగ్గాబాటి వెంకటేశ్వర్లు, పెనమలూరు నుంచి పార్థసారధి, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరావు, చంద్రగిరి నుంచి భాస్కర్‌రెడ్డి, పెనుకొండ నుంచి శంకర్ నారాయణ, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు వీళ్లందరూ వైసీపీ అభ్యర్థులు కాదు. పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు.వైసీపీ అభ్యర్థులంగా పాల్ పార్టీలోకి ఫిరాయించలేదు. వైసీపీ అభ్యర్ధులు వేరు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు వేరు. కాకపోతే రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఒక్కటిగానే ఉన్నాయి. ఇలా 35 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు సరిపోలాయి. నామినేషన్ల ఘట్టం ముగిసేవరకు ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని వైసీపీ అంచనా వేయలేక పోయింది. అంతకుముందు నుంచి ప్రజాశాంతి పార్టీ గుర్తు మీద వైసీపీ పదేపదే ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. పాల్ పార్టీకి ఈసీ హెలికాప్టర్ గుర్తు కేటాయించాయింది. ఆ గుర్తును ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా అక్కడ పార్టీ గుర్తును ప్రచారం చేసేవారు. మొదట్లో వైసీపీ నేతలు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఈసీ జాబితాలో ఉన్న గుర్తును చూసిన తర్వాత వైసీపీకి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఎందుకుంటే హెలికాప్టర్ రెక్కలు, ఫ్యాన్ రెక్కల్లాగే స్పష్టంగా ఉన్నాయి.జనసేన, ప్రజాశాంతి పార్టీలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజాశాంతి మాత్రమే వైసీపీకి మనశాంతి లేకుండా చేయలేదు. మరోవైపు పవన్ కూడా ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన తరుపున నిలబడిన అభ్యర్ధుల్లో దాదాపు సగానికిపైగా వైసీపీ నేతలే. టికెట్ రాదని క్లారిటీ వచ్చేసిన తర్వాత వారంతా వెళ్లి జనసేన చేరారు. కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి. అదే సమయంలో పవన్, జగన్‌పైనే గురిపెట్టారు. ఆయనపై ఉన్న కేసులు వివేకానందరెడ్డి హత్య, అసెంబ్లీకి వెళ్లకపోవడం వంటి అంశాలపై గురిపెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జగన్‌కు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. జనసేనాని టీడీపీ అధినేతను విమర్శించడం లేదని జగన్ మండిపడుతున్నారు. తనను ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారని, ఆయన చంద్రబాబు భాగస్వామి అని పవన్‌ను విమర్శిస్తున్నారు.

Related Posts