YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

తుపాకీతో ట్రాంప్ ఇంట్లోకి దూసుకొచ్చిన మహిళా

Highlights

  • వైట్ హౌస్ తనదేనని 
  • డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త 
  • అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • ఆమె ఆరోగ్యంగానే ఉందని కోర్టుకు చెప్పిన న్యాయవాది
తుపాకీతో ట్రాంప్ ఇంట్లోకి దూసుకొచ్చిన మహిళా

ఓ మ‌హిళ వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తూ.. తుపాకి పట్టుకుని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి దూసుకెళ్లడానికి ప్ర‌య‌త్నించింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఆమె టెన్నిస్సే రాష్ట్రానికి  చెందిన జెస్సికా ఫోర్డ్‌ (35) అనే మహిళ గా పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో దూసుకొచ్చిన ఆమెను తుపాకీ పడేసేందుకు  ఒప్పుకోకపోవడంతో అరెస్టు చేశామని చెప్పారు. ఆమె ఇలా ప్రవర్తించడం మొదటి సారి కాదని, గతంలో కూడా ఓ సారి వైట్ హౌస్‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిందని వివరించారు. వైట్ హౌస్ తనదేనని, డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త అని విచిత్ర వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. తన పిల్లలు కనిపించకుండా పోయారని, తన పిల్లలను వెతికి పెట్టాలని ఆమె అంటోందని తెలిపారు. 

Related Posts