YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆర్ బీఐ కొత్త బాండ్లు

ఆర్ బీఐ కొత్త బాండ్లు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త బాండ్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. వీటిల్లో కొత్త 7 ఏళ్ల కాలపరిమితి బాండ్లు, కొత్త 20 ఏళ్ల కాలపరిమితి బాండ్లు కూడా ఉండునున్నాయి. ఆర్‌బీఐ ఏప్రిల్ 5 బాండ్లను మార్కెట్‌లో జారీ చేయనుంది. రిజర్వు బ్యాంక్ ఈ బాండ్ల జారీ ద్వారా రూ.17,000 కోట్లు సమీకరించనుంది. మొత్తంగా ఐదు రకాల కాల పరిమితుల్లో ఐదు రకాల బాండ్లను జారీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐకి ఇదే తొలి బాండ్ల ఇష్యూ. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల కాలపరిమితి ఉన్న బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు, రెండేళ్ల కాలపరిమితి ఉన్న బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు, 2031లో మెచ్యూరిటీ అయ్యే బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. అలాగే 20 ఏళ్ల కాలపరిమిత ఉన్న బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు, 2055లో మెచ్యూరిటీ అయ్యే బాండ్ల ద్వారా రూ.4,000 కోట్లు పొందనుంది. 

Related Posts