కుప్పం ప్రజల అగచాట్లు చూస్తే చంద్రబాబు లాంటి మనిషి మరొకరు ఉండరని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..1978లో చంద్రగిరిలో పోటీచేసి 2400 ఓట్లతో తొలిసారిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రి అయ్యారు. 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీచేసి 17.200ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోయారు. అప్పటి నుంచి చంద్రగిరిని వదిలేసి బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పంను చంద్రబాబు ఎంచుకున్నారు. బీసీలను సులభంగా మోసం చేయొచ్చని బాబు కుప్పంకు వచ్చారు.30ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారు. కుప్పంలో ఒక్కప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లేదు. కుప్పంకు ఏదైనా మేలు జరిగిందంటే వైఎస్‌ఆర్ హయాంలో మాత్రమే. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు కూలీలుగా బెంగళూరు వెళ్తున్నారు.9 గంటల ఉచిత విద్యుత్ తన సొంత నియోజకవర్గంలో అమల్లోలేదు. సెక్షన్30 అమలు చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు.3 సార్లు సీఎం అయినా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తామని జగన్ పేర్కొన్నారు.