Highlights
- కేంద్రమంత్రి సురేష్ ప్రభు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు సమాధానం దాటవేశారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి గత మూడురోజులుగా విశాఖలోనే ఉన్నారు సోమవారం ఉదయం ఆయన రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి సింహాచలం శ్రీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే స్థానిక విలేకరులు సురేష్ ప్రభును ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నంచారు. దాంతో అయన సమాధానం చెప్పకుండా ఉచిత సలహా ఇచ్చిపోయారు. ప్రస్తుతం తాను దైవదర్శనానికి వచ్చానని ఇలాంటి సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని సురేష్ బాబు విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన కారులో పద్మనాభం గ్రామానికి వెళ్లిపోయారు.