యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ఇటీవల గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చాలా కాలం రెస్ట్ తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించే 'బ్రహ్మి ఈజ్ బ్యాక్' చిత్రంలో ఆయన లీడ్ రోల్ పోషిస్తారట.