
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అద్భుత విజయం! లిన్, నరైన్ కళ్లుచెదిరేలా ఆడిన వేళ ఆ జట్టు రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఆదివారం మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 3 వికెట్లకు 139 పరుగులే చేసింది. స్టీవ్ స్మిత్ (73 నాటౌట్; 59 బంతుల్లో 7×4, 1×6) రాణించాడు. హ్యారీ గార్నీ (2/25) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. లిన్, నరైన్ మెరుపులతో లక్ష్యాన్ని కోల్‌కతా 13.5 ఓవర్లలోనే రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది.