YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

శ్రీదేవి మృతినే  ప్రశ్నిస్తున్న జాప్యం..

Highlights

  • నిజానిజాల నిగ్గుతేలాల్సింది
శ్రీదేవి మృతినే  ప్రశ్నిస్తున్న జాప్యం..

ప్రముఖ నటి  శ్రీ‌దేవి భౌతిక కాయాన్ని ముంబై తరలింపు మరింత జటిలంగా తయారైంది. దుబాయ్ లో జరిగిన వాస్తవాలు ఎలా ఉన్నా.. శ్రీదేవి మృతి రానురాను మరింత సమస్యాత్మకంగా తయారవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక మహా నటి విషయంలో  జరుగుతున్నప్రచారం.. ఆమె గౌరవానికి భంగం వాటిల్లేలా ఉంది. అంతేకాకుండా  చివరికి కఠినతరమైన దుబాయ్ ప్రభుత్వ నిబంధలకే సందేహాత్మకంగా మారింది. దుబాయ్ పాలనాపరమైన వ్యవహారాల కారణంగా  మ‌రింత జాప్యం జరుగుతున్నందునే ఈ ప్రచారాలకు ఊతమిస్తుంది. పెళ్ళి వేడుకలో  డ్యాన్స్ చేసిన  శ్రీదేవి హోటల్ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి పెద్ద పెద్ద వివాహ వేడుకల్లో ఆల్కహాల్ టెస్టుకోవడం సర్వసాధారణమైన అంశం. అలంటి పరిస్థితిలో ఉన్న శ్రీదేవికి సర్పరైజ్ విజిట్ గా వచ్చిన బోనీకపూర్ ఆమె ను  బయటకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు. ఈ  ప్రయత్నంలో శ్రేదేవి ప్రెష్ కావడానికానీ వాష్ రూంకి వెళ్లి అక్కడే పడిపోయి ఉండవచ్చు.. ఏది ఏమైనప్పటికి దుబాయ్ ప్రభుత్వం శ్రీదేవి మృతి విషయంలో లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పోస్టుమార్ట‌మ్ ఆల‌స్యం, ఫోరెన్సిక్ రిపోర్టుపై ప‌లు అనుమానాలు త‌లెత్తిన నేప‌థ్యంలో దుబాయ్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాసేపటి క్రితమే శ్రీదేవికి నిర్వహించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు. పైగా శ్రీదేవి రక్తం నమూనాలో ఆల్కహాల్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమె  శరీరం తూలి ఆమె బాత్‌టబ్‌లో జారిపడినట్లుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీదేవి శరీరాన్ని ఎంబాల్మింగ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీస్ నివేదిక దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు చేరుకున్న తర్వాత.. ఆ కేసులో న్యాయప్రక్రియను పూర్తి చేస్తారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వ్య‌క్తి న్యాయపరమైన హక్కులను కాపాడుతుంది. ఏదైనా కేసు విచారణలో ఉన్న పారదర్శకతను అది విశ్వసిస్తుంది. ఇదిలా ఉండగా శ్రీదేవి మృతిపై దుబాయ్ వైద్యులు ప్రాథమిక నివేదికను మాత్రమే ఇచ్చారని భారత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ (ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం) అనే పదాన్ని వాడారని, సాధారణంగా ఇలాంటి పదాన్ని ఆ విధంగా ఉపయోగించరని అన్నారు. శ్రీదేవి మృతి ప్రమాదమా? కుట్ర? ఆత్మహత్య? అనే విషయం పూర్తి స్థాయి నివేదికలోనే వెల్లడవుతుందని, కెమికల్, విస్రా విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారని భారత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. 
కాగా, యాక్సిడెంటల్ డ్రౌనింగ్ కారణంగా శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్ మ‌ృతి చెందినట్టు దుబాయ్ వైద్యుల ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అచ్చుతప్పులు ఉండటం గమనార్హం. ‘ACCIDENTAL DROWNING’కు బదులు ‘ACCIDENTAL DRAWNING’ అని ఆ నివేదికలో ఉంది. దీంతో, ఈ నివేదిక కొత్త సందేహాలకి దారితీస్తుంది. జరిగిన వాస్తవాలు ఎలా ఉన్నపటికీ శ్రీదేవి మృతి విషయంలో జరుగుతున్న ప్రచార సరళిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts